వేములవాడఅర్బన్: జిల్లాకు చెందిన ఇద్దరికి ఉగాది పురస్కారాలు దక్కాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు ఈశ్వర్‌గారి సురేష్, నాదస్వర కళాకారుడు శ్రీనివాస్‌కు ఉగాది పురస్కారాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.
బోయినపల్లివాసికి గద్దర్ అవార్డు ప్రశంసలు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025లో భాగంగా లఘుచిత్రాల విభాగంలో బోయినపల్లి మండలకేంద్రానికి చెందిన కనపర్తి హన్మాండ్లు డిప్లొమా ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన టీజీఎఫ్‌ఏ అవార్డుల కార్యక్రమలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, దిల్ రాజు, ప్రియాంక చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనే లఘు చిత్రానికి ప్రశంసా పత్రం దక్కింది.


