ప్రస్తుతం యువతలో విపరీతంగా కోపం, హింసాత్మక ప్రవర్తన కనిపిస్తుంది. వీటన్నంటికీ మూలం మత్తు పదార్థాలకు అలవాటుపడడం. డ్రగ్స్ ప్రభావంలో వారు చేసే నేరాలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌లో హింసాత్మక గేమ్స్, సినిమాల ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడాలి. వారి కోసం సమయం కేటాయించాలి. పాఠశాలలు, కాలేజీల్లో కౌన్సెలింగ్ సదుపాయాలు కల్పించాలి.
– సురేంద్రబాబు, పిల్లల వైద్యనిపుణుడు, సిరిసిల్ల


