లీవ్‌లో ఉండి ఇసుక అనుమతులు!
● ఒక రోజు ముందే పత్రాలపై సంతకాలు
బోయినపల్లి(చొప్పదండి): సెలవులో ఉండే ముందురోజు సంతకాలు చేసి ఇసుక అనుమతులు ఇచ్చిన అధికారి తీరు అనుమానాలకు తావిస్తోంది. మండలంలోని మాన్వాడ మానేరువాగు నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. శనివారం ఇసుక రవాణాకు డీటీ భూపేశ్ సంతకంతో ఇసుక అనుమతిపత్రాలు జారీచేశారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ భూపేశ్ శనివారం సెలవులో ఉన్నారు. అయినప్పటికీ డ్యూటీలో ఉన్నట్లుగా అనుమతులు ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇసుక డీడీలు చెల్లించిన వారికి ఇసుక పోయకుండా పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో డీటీ భూపేశ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా తాను శనివారం సెలవులో ఉన్నానని అందుకే ముందు రోజు ఇసుక అనుమతి పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలిపారు. ముందస్తు అనుమతులు ఇవ్వచ్చని స్పష్టం చేశారు.


