నిబంధనలు చిత్తు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు చిత్తు!

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

నిబంధ

నిబంధనలు చిత్తు!

బెల్టుషాపు నిర్వాహకుల అసోసియేషన్‌

మామూళ్ల మత్తు..

లైసెన్స్‌కు రూ.2 లక్షలు నెలనెలా రూ.26.40 లక్షలు

ధరలు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

ముస్తాబాద్‌లో బెల్ట్‌షాపు అసోసియేషన్‌ !

జిల్లాలో ఎస్సీలకు రిజర్వు అయిన ఓ వైన్స్‌లో ఓ దళిత యువకుడు ముగ్గురితో కలిసి నాలుగు దరఖాస్తులు(రూ.12 లక్షలు వెచ్చించి) చేశారు. అదృష్టం కలిసొచ్చి డ్రాలో వైన్స్‌ దక్కింది. లైసెన్స్‌ కోసం ఎకై ్సజ్‌ అధికారులను కలువగా రూ.2లక్షలు ఇస్తేనే లైసెన్స్‌ పత్రాలు ఇస్తామనడంతో అవాక్కవడం యువకుడి వంతైంది. ఇది ఎప్పుడూ ఉండేదేనని ఎకై ్సజ్‌ అధికారి సమాధానంతో దిక్కులు చూశాడు. గతంలో రూ.లక్ష ఉందని.. ఇప్పుడు రూ.2లక్షలు చేశామనడంతో చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చి లైసెన్స్‌ తెచ్చుకున్నాడు. ఇలా జిల్లాలోని 48 వైన్‌షాపుల నిర్వాహకులు రూ.2లక్షల చొప్పున ముట్టజెప్పారు.

సిరిసిల్ల: జిల్లాలోని వైన్‌షాపుల నిర్వాహకులు ఎక్సైజ్‌ అధికారులకు మామూళ్లు ఇస్తూ.. వాటిని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వైన్స్‌ల్లో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, ఆఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40, బీర్లకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. వీటితోపాటు బెల్టుషాపుల నిర్వాహకులకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అధికారులకు ఇస్తున్న మామూళ్ల నష్టాలను మద్యం వ్యాపారులు వినియోగదారుల నుంచి ఇలా వసూలు చేస్తున్నారు.

అటు ఇచ్చి.. ఇటు వసూలు చేసి

జిల్లాలో డిసెంబర్‌లో వైన్‌షాపులు ప్రారంభించే సమయంలో లైసెన్స్‌లకు రూ.2లక్షల చొప్పున ముట్టజెప్పిన వ్యాపారులు హాయిగా బిజినెస్‌ చేసుకోవచ్చని భావించారు. కానీ నెల రోజులు గడవగానే జనవరి మొదటి వారంలోనే ఎకై ్సజ్‌ అధికారులు నెలవారీ మామూళ్ల కోసం వచ్చారు. లైసెన్స్‌ల కోసం ఇచ్చినవి ఉన్నతాధికారులకు ముట్టాయని.. మా సంగతి ఏమిటంటూ ప్రతీ వైన్స్‌కు రూ.25వేలు చొప్పున వసూలు చేసుకున్నారు. ఇక స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ప్రతీ వైన్స్‌ నుంచి రూ.30వేలు.. ఇలా ప్రతీ నెల పోలీసుల వాటా రూ.14.40లక్షలు వెళ్తున్నాయి. ఇలా ఎకై ్సజ్‌, పోలీసులకు ముట్టజెప్పుతున్న మామూళ్లను కొందరు మద్యం వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి కస్టమర్ల నుంచి వసూలు చేసుకుంటున్నారు. మరికొందరు ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఎవరికీ పట్టని అక్రమాలు

వైన్‌షాపుల పక్కనే ఉన్న పర్మిట్‌రూమ్స్‌లలో బార్లను తలపించేలా సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. తినుబండారాలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వేములవాడ కమాన్‌ వద్ద రెండు వైన్స్‌లు, ఓ బారు ఉండగా.. రోడ్డును ఆనుకుని వాహనాలు నిలుపుతుండడంతో ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

అవును.. మీరు చదువుతోంది వింతగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ముస్తాబాద్‌ మండలంలో బెల్టుషాపు నిర్వాహకులు అందరూ కలిసి అసోసియేషన్‌గా ఏర్పాటయ్యారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారులను ఎన్నుకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జిల్లాలో బెల్టుషాపుల మాఫియా బలోపేతమై పల్లెల్లో పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చులు మొదలయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో విచ్చలవిడిగా వెలసిన బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిబంధనలు చిత్తు!1
1/2

నిబంధనలు చిత్తు!

నిబంధనలు చిత్తు!2
2/2

నిబంధనలు చిత్తు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement