ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● డీఎఫ్‌వో బాలమణి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తిప్పాపురం, సిరికొండ, అనంతగిరి, పెద్దలింగాపురం గ్రామ పరిధిలో పులి సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో సీహెచ్.బాలమణి కోరారు. మండలంలోని అనంతగిరిలో బుధవారం మాట్లాడారు. రైతులు పొలాల వద్దకు ఉదయమే కాకుండా ఆలస్యంగా వెళ్లాలని సూచించారు. పశువులను ఇంటివద్ద కట్టి వేసుకోవాలని తెలిపారు. రెండు రోజులుగా తిప్పాపురం, సిరికొండ, అనంతగిరి, పెద్దలింగాపూర్ గుట్టల ప్రాంతాల్లో అటవీ సిబ్బంది గాలిస్తున్నారని తెలిపారు. పోచమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎఫ్‌ఆర్వో కల్పన, ఎఫ్‌బీవో వసుమతి ఉన్నారు. సర్పంచ్ అరుకాల నవీన్‌కుమార్, ఆలయ చైర్మన్ కోలాపురి అంతగిరి ఉన్నారు.
‘జెడ్’ సర్టిఫికేషన్‌తో పరిశ్రమల అభివృద్ధి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సూక్ష్మ, చిన్న, మధ్యతర హా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) అంతర్జాతీయస్థాయిలో రాణించాలంటే ‘జెడ్’ సర్టిఫికేషన్ అవసరమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.హనుమంతు పేర్కొన్నారు. తంగళ్లపల్లిలోని మహిళా సమాఖ్య మీటింగ్‌హాలులో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జనరల్ మేనేజర్ మాట్లాడుతూ నాణ్య మైన ఉత్పత్తులు తయారుచేస్తూ పర్యావరణా నికి హాని కలగకుండా పరిశ్రమలు నడపడమే సర్టిఫికేషన్ ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. అనంతరం జెడ్ ఫెసిలిటేటర్ బి.విజయ్‌కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ టి.ఆంజనేయులు మా ట్లాడుతూ ఈ సర్టిఫికెట్ పొందడం ద్వారా అందే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ అవకాశాలు వివరించారు. ఈడీసీ మేనేజర్ జయంత్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటశివసాయి, జిల్లాలోని రైస్‌మిల్లర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): జీరో నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని డీఎంహెచ్‌వో రజిత సూ చించారు. మండలంలోని కొదురుపాక పీహెచ్‌సీని బుధవారం తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల నిల్వలు పరిశీలించారు. కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలన్నారు. వైద్యులు సంపత్‌కుమార్, రేణు ప్రియాంక పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): అధికారులు రైతుల రిలే నిరాహార దీక్షపై నిర్లక్ష్యం వహిస్తే ఆగ్రహానికి గురికాక తప్పదని బీజేపీ మండలాధ్యక్షుడు భూమల్ల అనిల్‌కుమార్ హెచ్చరించారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లో రైతులు 9 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 అసంపూర్తి కాల్వ పనులు పూర్తి చేయాలని కోరుతూ దీక్షలు చేపట్టారు. ఈ కాలువను పూర్తి చేస్తే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నా రు. మారవేణి రాజు, కరికె నవీన్‌కుమార్, ప య్యావుల బాలయ్య, గాదె మధుసూదన్, దేవరాజు, దుమాల రాజు, ఎద్దు నర్సయ్య, కొమ్ముల పరుశరాములు, శ్రీనివాస్, కనకయ్య, ఎల్లం పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు గంభీరావుపేటలోని మన గ్రోమోర్ దుకాణం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. యూరియా యాప్‌పై అవగాహన లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేవన్నారు. పాతపద్ధతిలో పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్‌కార్డుల ఆధారంగా యూరియా అందించాలని కోరారు. ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ చిట్టంపల్లి రాజు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


