కిలోమీటరు నడిచి వెళ్తున్న
ఆవునూర్ నుంచి మా ఊరు ఏడేళ్ల క్రితమే వేరుపడింది. మా ఊరికి రేషన్ షాపు ఇప్పటికీ రాలేదు. ప్రతీ నెల బియ్యం కోసం ఆవునూర్‌కు కిలోమీటరు దూరం నడిచిపోయి తెచ్చుకుంటున్న. నెత్తిమీద బియ్యం పెట్టుకుని నడుసుడు ఇబ్బంది అయితాంది. సార్లు దుకాణం మంజూరు చేపియ్యాలి.
– కోటగిరి మల్లవ్వ, రామలక్ష్మణపల్లి
మా ఊరు 2019లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటైంది. వందకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. బియ్యం కోసం 3 కిలోమీటర్ల దూరంలోని పోతుగల్‌కు వెళ్తున్నారు. బైకులు లేని వారు నడిచిపోతున్నారు. అధికారులు స్పందించి రేషన్‌దుకాణం మంజూరు చేయాలి.
– రేసు రఘు, సర్పంచ్, గన్నెవారిపల్లి
కిలోమీటరు నడిచి వెళ్తున్న


