
ఎన్నాళ్లీ అణచివేత
జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పత్రికా స్వేఛ్చను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజా సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు హల్‌చల్ చేయడంపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అణగదొక్కే కుటిల యత్నాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కేసులతో మీడియాను నియంత్రించలేమనే విషయాన్ని అధికార వర్గాలు గుర్తించాలి. మీడియాను ఇబ్బంది పెడితే భవిష్యత్ పరిణామాలు అనుభవించక తప్పదు.
– గుంటి వేణు, సీపీఐ జిల్లా నాయకులు
ప్రజాసమస్యలను ప్రశ్నించిన మీడియాకు నోటీసులు పత్రికా స్వేచ్ఛను హరించినట్లే. అన్యాయాలను ప్రజలకు తెలిపేలా పత్రికల్లో వచ్చే కథనాలను జీర్ణించుకోలేక ఎడిటర్లపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదు. – లాయక్‌పాషా,
టీయూడబ్ల్యూజే, జిల్లా అధ్యక్షుడు

ఎన్నాళ్లీ అణచివేత

ఎన్నాళ్లీ అణచివేత