
మిగిలింది రెండు రోజులే
సిరిసిల్ల క్రైం: జిల్లాలో వైన్ షాపుల లైసెన్స్‌ల కోసం పోటీ పెరుగుతోంది. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. 48 వైన్‌షాపులకు ఇప్పటివరకు మొత్తం 552 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు.
లాటరీ విధానంలో కేటాయింపు
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం లైసెన్సులు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది డ్రా తేదీ త్వరలో ప్రకటించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.
చివరి నిమిషం రష్
చివరి తేదీ సమీపిస్తుండటంతో ఎకై ్సజ్ కార్యాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడురాయన్న ఆలోచనలు అందరిలో ఉన్నాయి. ఇంకా రెండు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.