
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
వేములవాడఅర్బన్: మన జీవన విధానంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని జిల్లా కో ఆర్డినేటర్ సురేశ్ కోరారు. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ సహకారంతో బుధవారం క్యాంపస్ ఎకో బజార్, స్వదేశీ దీపావళి నిర్వహించారు. సురేశ్ మాట్లాడు తూ మన జీవితంలో ప్లాస్టిక్ వస్తువు ఒక భాగంగా మారిపోయిందన్నారు. హోటళ్లలో పేపర్ కప్పుల ద్వారా టీ తాగడం ద్వారా ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయన్నారు. విద్యార్థులు మ ట్టితో ప్రమిదలను, బట్టతో సంచులను, మిల్లెట్‌తో ఆహార పదార్థాలు తయారు చేశారు. ప్రిన్సిపాల్ శంకర్, లావణ్య, ప్రేమ్‌కుమార్, కరుణ, శ్రీధర్‌రావు, ప్రసాద్ పాల్గొన్నారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): రేషన్‌బియ్యం తూకంలో తేడా రావడంతో గ్రామస్తులు డీలర్‌ని నిలదీసిన ఘటన మండలంలోని అడవిపదిరలో చోటుచేసుకుంది. కొందరు లబ్ధిదారులు బుధవారం బియ్యం తీసుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానంతో బియ్యాన్ని కిరాణషాపులో మళ్లీ తూకం వేయించారు. తేడా రావడంతో రేషన్‌డీలర్‌ని నిలదీశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మిడ్‌మానేరులో 27 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు)లో నీటిమట్టం 27.145 టీఎంసీలకు చేరింది. మానేరు, మూలవాగుల్లోంచి 476 క్యూసెక్కులు వస్తోంది.