
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
సిరిసిల్ల: జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను బుధవారం నుంచి ఇవ్వనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోని 95వేల పశువులకు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. ఏటా ప్రభుత్వం పశువులకు రెండుసార్లు ఈ టీకాలు ఉచితంగా వేస్తుందని వివరించారు. జిల్లాలోని 13 మండలాల్లో 19 బృందాలు క్షేత్రస్థాయిలో ఈ టీకాలు వేస్తాయన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్తలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం.హరిత పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలోని పశువుల యజమానులు తమ జీవాలకు టీకాలు వేయించాలని కోరారు.