
శృంగేరి పీఠాధిపతుల దర్శనానికి రండి
వేములవాడ: హైదరాబాద్‌లోని నల్లకుంట శంకర్‌మఠంలో శృంగేరి జగద్గురువు విధుశేఖర భారతీస్వామి దర్శనానికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం విప్ ఆది శ్రీనివాస్, శంకరమఠం ధర్మాధికారి శ్రీనివాసమూర్తి, రాముబంటు, రవి, శృంగేరిపీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణశర్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల తీరు తెన్నుల గురించి, కలికోట సూరమ్మ ప్రాజెక్టు అంశాలపై చర్చించినట్లు విప్ తెలిపారు.
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలని ఎస్పీ మహేశ్ బీ.గీతే సూచించారు. మంగళవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో కేసుల నమోదు, తదితర వివరాలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా భరోసా కల్పించాలన్నారు. రోజూ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృషికి తీసుకురావాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ‘జర్నల్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రూపొందించిన ఇంటర్నేషనల్ జర్నల్ ప్రత్యేక సంచికను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. మండలి వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, గంభీరావు పేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
సిరిసిల్లటౌన్: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రేవా జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని అసోసియేషన్‌లో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 17న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన జిల్లాలోని ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి చౌకి సుధాకర్, పట్టణ అధ్యక్షుడు టీవీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

శృంగేరి పీఠాధిపతుల దర్శనానికి రండి

శృంగేరి పీఠాధిపతుల దర్శనానికి రండి