
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి పుష్పలత అన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మంగళవారం కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జడ్జి హాజరై మాట్లాడారు. బాలికలు అభ్యున్నతి సాధించినప్పుడే దేశం ప్రపంచ దేశాల సరసన నంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ మాట్లాడుతూ, విద్యార్థి దశనుంచే రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పోటీలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్సై వినీత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు లకవత్ మోతీలాల్, స్టాఫ్ సెక్రటరీ పాకాల శంకర్‌గౌడ్, గుర్రం ఆంజనేయులు, ఆడెపు వేణు, చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు మినీ జాబ్‌మేళా
సిరిసిల్లకల్చరల్: ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16న మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత గురువారం ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయానికి తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రూ.10 నుంచి రూ.20వేల వేతనం లభిస్తుందన్నారు. పూర్తి వివరాలకు 94934 72412 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.