
విద్యార్థులకు ఇబ్బందిలేకుండా చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఏడు ఉండగా, 338 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఎస్టీ విద్యార్థులకు ఒక స్కూల్ ఉండగా 35 మంది చదువుతున్నారని వివరించారు. ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్నవారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతకు ముందు ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి వినోద్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి ఎస్సీడీవో రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.