
ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: ఓటర్ జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రివి జన్(ఎస్‌ఐఆర్) కోసం ఏ, బీ, సీ, డీగా విభజించి, ఈనెల 23లోపు ఎస్‌ఐఆర్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం రెవెన్యూ అధికారులతో సమీక్షించా రు. 2002 నాటి ఎస్‌ఐఆర్ డేటాను 2025 డేటాతో పరిశీలించి కామన్‌గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను మరోసారి ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ఓటర్ జాబితా, 2002లో ఉన్న ఓటర్ల కామన్ డేటాతో కేటగిరీ ఏ, 2002లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరీ బీ, 1987 నుంచి 2004 మధ్య పుట్టి ఉంటే కేటగిరీ సీ, 2004 తర్వాత ఉంటే కేటగిరీ డీ కింద పరిగణించాలని సూచించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
బతుకమ్మ ఉత్సవాలను ఈనెల 21 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. గ్రామపంచాయతీల పరిధిలోని చెరువులను పరిశుభ్రంగా ఉంచి, వెలుతురు, ఇతర వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 30న గ్రాండ్ ఫినాలే ‘సద్దుల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సన్నద్ధం కావాలని సూచించారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని శనివారం పరిశీలించారు. నారెడ్డిపల్లి రోడ్డు పనులు చేపట్టాలని, తాళ్లపల్లి నుంచి బేగంపేట వెళ్లే రోడ్డులో ఉన్న అంపు ఒర్రైపె బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్లు వెళ్లలేని పలు రోడ్లను ఎమ్మెల్యే, కలెక్టర్‌లు ద్విచక్రవాహనాలపై వెళ్లి పరిశీలించారు.