
చక..చకా పనులు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపట్టేందుకు భీమన్నగుడిలో నిర్మాణాలు, క్యూలైన్లు, షెడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఆలయం పక్కనే ఉన్న ఈవో కార్యాలయం, మెయిన్ గెస్ట్‌హౌస్, ప్రసాదాల తయారీ గోదాం, అకౌంట్స్ విభాగాల భవనాలను కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమన్న గుడిలోకి క్యూలైన్లు, ఈశాన్యం పెద్ద దర్వాజ, మండపాలు, షెడ్ల నిర్మాణం పనులు వేగం అందుకున్నాయి. వేదపాఠశాలను శివస్వాముల భవనంలోకి మార్చుతూ ఈ భవనంలో ప్రసాదాల తయారీ గోదాంను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు పూర్తయిన వెంటనే భీమన్నగుడిలో దర్శనాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్ విభాగం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, అకౌంట్స్ ఆఫీస్, ప్రొటోకాల్ ఆఫీస్, ఆలయ మెయిన్ గోదాంలను భీమేశ్వర సదన్‌లోని మొదటి అంతస్తులోకి తరలిస్తున్నారు. ఈవో కార్యాలయం కూల్చివేత పనులు ఆదివారం నుంచి ప్రారంభించారు.
విద్యానగర్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు