
పకడ్బందీగా పెట్రోలింగ్
మహేశ్ బీ గీతే,
ఎస్పీ
సిరిసిల్లక్రైం: బతుకమ్మ, దసరా పండుగలతో విద్యాసంస్థలకు దాదాపు పక్షం రోజులపాటు సెలవులు రావడంతో పలువురు పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డ ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారు సమీప ఠాణాలో సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. సెలవుల నేపథ్యంలో జిల్లాలో పెట్రోలింగ్‌ను మరింత పకడ్బందీగా చేపడతామన్నారు. దొంగతనాలను కట్టడి చేసేందుకు ఇప్పటికే పోలీసులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. పండుగల సెలవుల నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న భద్రతచర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..