
వేతనాలు లేక వెతలు తీరక !
వేతనాలు పెండింగ్ ఇలా..
ఉపాధిహామీలోని ఉద్యోగులు, సిబ్బంది
● ‘ఉపాధి’ సిబ్బందికి అందని వేతనాలు ● నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. ● పండుగకు తప్పని ఆర్థిక తిప్పలు ● కూలీలకూ రూ.11కోట్లకు పైగా బకాయిలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ మర్రి ఎల్లవ్వ. ఈమె ఏప్రిల్, మే నెలల్లో ఐదు వారాలపాటు ఉపాధిహామీ పనికి వెళ్లింది. రెండు వారాల డబ్బులు చెల్లించగా.. మరో మూడు వారాల డబ్బులు రావాల్సి ఉంది. ఈ సమస్యను జిల్లా వ్యాప్తంగా 67,990 మంది కూలీలు ఎదుర్కొంటున్నారు. వీరికి రూ.11,01,38,030 కూలీ డబ్బులు రావాల్సి ఉంది.
చందుర్తి (వేములవాడ): వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో పనిచేసిన కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. పనులు చేసినా పస్తులుండే పరిస్థితి వచ్చిందని జిల్లాలోని ఉపాధిహామీ కూలీలు వాపోతున్నారు.
సిబ్బంది, ఉద్యోగులదీ అదే పరిస్థితి
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు ఉద్యోగులు కూడా వేతనాల కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొంది. నిత్యం కూలీలతో పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేవు. మండలాల్లో పనిచేస్తున్న ఏపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగభద్రత లేక వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పని దినాలను బట్టి వేతనాలు అందిస్తుండడంతో.. చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో పలువురు కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం వేతనాల్లో కోత పడేలా ఉందని వారు వాపోతున్నారు.
మండలం కూలీలు డబ్బులు
బోయినపల్లి 4,641 రూ.43,14,352
చందుర్తి 4,842 రూ.87,78,857
ఇల్లంతకుంట 7,942 రూ.1,27,43,810
గంభీరావుపేట 8,406 రూ.2,13,42,525
కోనరావుపేట 7,312 రూ.1,35,40,739
ముస్తాబాద్ 7,011 రూ.92,32,851
రుద్రంగి 2,359 రూ.36,11,226
తంగళ్లపల్లి 7,566 రూ.88,99,015
వీర్నపల్లి 4,913 రూ.1,17,34,766
వేములవాడ 1,301 రూ.11,50,834
వేములవాడరూరల్ 3,246 రూ.33,88,132
ఎల్లారెడ్డిపేట 8,451 రూ.1,14,01,283
ఏపీడీ 01
ప్లాంటేషన్ సూపర్‌వైజర్ 01
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 04
ఏపీవోలు 09
కంప్యూటర్ ఆపరేటర్లు 19
ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు 05
టెక్నికల్ అసిస్టెంట్లు 34
ఫీల్డ్ అసిస్టెంట్లు 152

వేతనాలు లేక వెతలు తీరక !