
పితృదేవతలకు సంతర్పణ
సిరిసిల్లటౌన్: పెద్దల అమావాస్యను సిరిసిల్ల పట్టణ ప్రజలు ఆదివారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బాధ్రపద అమావాస్య రోజున పితృదేవతలకు బియ్యం ఇవ్వడం ఆనవాయితీ. పట్టణంలోని వేదపండితులు, పూజారులకు పెద్దల పేరున బియ్యం, కూరగాయలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందారు. బియ్యం ఇచ్చేందుకు భారీగా తరలిరావడంతో స్థానిక పెద్దబజారు హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర ఆలయం, గీతానగర్ సమీపంలోని కాలనీల్లో అయ్యవార్లు, బ్రాహ్మణులు, జంగమయ్య ఇళ్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు ఇచ్చారు.