
ఏమేమి పువ్వొప్పునే..
● మానేరుతీరం.. పూలవనం
సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలోని వీధులు విరివనాలయ్యాయి. మానేరుతీరంలో పూలజాతర వెలసింది. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ జిల్లాలోని గ్రామాలు మారుమోగాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుమ్మ వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ‘బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడపడచులు ఎంగిలిపూల పండుగను సంబురంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఆటలు.. కొలాటాలతో సిరిసిల్ల పట్టణంలో మహిళలు సంతోషంగా ఆడిపాడారు. మానేరుతీరంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తొట్టిలలో నిమజ్జనం చేశారు. పసుపు, కుంకుమలు, వాయినాలు ఇచ్చుపుచ్చుకున్నారు. ఫలహారాలతో గౌరమ్మకు నైవేద్యం సమర్పించారు. వేములవాడ రాజన్న ఆలయం వద్ద స్థానిక మహిళలు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆట ఆడిన మహిళలు మూలవాగులోని తెప్ప వద్ద నిమజ్జనం చేశారు.

ఏమేమి పువ్వొప్పునే..

ఏమేమి పువ్వొప్పునే..

ఏమేమి పువ్వొప్పునే..

ఏమేమి పువ్వొప్పునే..

ఏమేమి పువ్వొప్పునే..

ఏమేమి పువ్వొప్పునే..