
‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల/తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం పరిశీలించారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాళ్లపేటలో 57 ఇళ్లు మార్క్‌చేయగా 10 బేస్మెంట్ లెవెల్, 10 గోడలు, 20 స్లాబ్, 17 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రానున్న పండగ రోజుల్లో గృహప్రవేశాలు చేయాలని సూచించారు.
ఇసుక కొరత ఉంటే తహసీల్దార్లను సంప్రదించండి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉంటే తహసీల్దార్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లాలో 10,234 ఇళ్లు మంజూరుచేయగా ఇప్పటికే 5,308 మంది పనులు ప్రారంభించారని, 2,549 మంది బేసిమెంట్ వరకు, 618 మంది గోడల వరకు, 285 మంది రూప్‌లెవల్ వరకు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇసుక కొరత లేకుండా, నిర్మాణ సామగ్రికి అధిక ధరల సమస్య లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. హౌసింగ్ పీడీ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించండి
ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లోని ఇందిరమ్మకాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాలనీలోని సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని చూసిన కలెక్టర్ కాలనీలో అన్ని వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవో శశికళ, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి, కార్యదర్శి రంజిత్ కుమార్ ఉన్నారు. అనంతరం రహీంఖాన్‌పేటలోని మోడల్‌సూ్‌క్‌ల్‌ను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.