జెండాను ఆవిష్కరించిన విప్‌ శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

జెండాను ఆవిష్కరించిన విప్‌ శ్రీనివాస్‌

Sep 18 2025 7:49 AM | Updated on Sep 18 2025 2:25 PM

-

జెండాను ఆవిష్కరించిన విప్‌ శ్రీనివాస్‌

జెండాను ఆవిష్కరించిన విప్‌ శ్రీనివాస్‌

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

జెండా వందనం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

సిరిసిల్ల: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని, ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను ఎగురవేశారు. పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రజాపాలన వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. 60 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు.

రైజింగ్‌ తెలంగాణ లక్ష్యంగా..

2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్‌చేంజర్‌ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం తమదన్నారు. ఈ సంకల్పానికి దార్శనికపత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ అని వివరించారు. జిల్లాలోని ఎస్‌హెచ్‌జీల ద్వారా 23 ఫర్టిలైజర్‌ షాపులు ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీనిధి ద్వారా రూ.25కోట్ల రుణాలు అందించామని, 5,691 యూనిట్లకు 1,607 గ్రౌండింగ్‌ చేశామని, చేయూత పింఛన్లు 1,17,370 మందికి ప్రతి నెలా రూ.25.73కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

నేతన్నలకు ఉపాధి

మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు అందించే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి చీరల ఉ త్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు అందించామ న్నా రు. ఇప్పటికే 4.30కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 1,77,851 కుటుంబాలకు సన్నబియ్యం అందుతుందని, కొత్తగా 14,075 రేషన్‌కార్డులు అందించామని, 3,376 మంది పేర్లను ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్పించామన్నారు.

రైతు రుణమాఫీ

రాష్ట్రంలోని 25.35లక్షల రైతులకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇందిరమ్మ రైతు భ రోసా కింద ఎకరాకు రూ.12వేల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 393 రైతు కుటుంబాలకు రూ.18కోట్ల బీమాసాయం పంపిణీ చేసిన ట్లు, 47,977 మందికి రూ.381.45కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు.

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

జిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇళ్లు, అదనంగా మధ్యమానేరు నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మహిళలు రూ.119.50 కోట్ల విలువైన జీరో టిక్కెట్లపై ప్రయాణం చేశారని తెలిపారు. జగ్గారావుపల్లి, పద్మనగర్‌, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్‌(వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.16.85కోట్లు, ఎల్‌వోసీల ద్వారా రూ.5కోట్ల మేరకు మేలు జరిగిందన్నారు. 20 నెలల్లో 60వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలి పారు. 39 రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో ఆన్‌లైన్‌ అకాడమీ సంస్థ ద్వారా ఐఐటీ ఫౌండేషన్‌, ఐఐటీ–జేఈఈ, నీట్‌–యూజీ మెడికల్‌ ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందిస్తున్నామని తెలిపారు. చివరి ఆయకట్టుకు సా గునీరందేలా ప్రాజెక్టుల పనులు చేస్తున్నామన్నా రు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బి గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, ఏఎస్పీ చంద్రయ్య, జెడ్పీ సీ ఈవో వినోద్‌కుమార్‌, డీఆర్‌డీవో శేషాద్రి ఉన్నారు.

రాజన్న ఆలయంలో వేడుకలు

వేములవాడ: రాజన్న ఆలయంలో ఈవో రమాదేవి జాతీయజెండాను ఆవిష్కరించారు. అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ సంపత్‌రెడ్డి సిబ్బందితో ప్రమాణం చేయించారు.

డీపీవోలో జెండా ఆవిష్కరణ

సిరిసిల్లక్రైం: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆవిష్కరించారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement