
విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
● జడ్జి రాధిక జైశ్వాల్
ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి రాధిక జైశ్వాల్ కోరారు. ఇల్లంతకుంటలోని ప్రభుత్వ హైస్కూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మత్తుపదార్థాల అలవాట్లతో జీవితంలో అనేక నష్టాలు జరుగుతాయన్నారు. పిల్లలహక్కులు, పోక్సో చట్టం గురించి వివరిస్తూ వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హైకోర్టు అడ్వకేట్ ఎడపల్లి హరీశ్, హెచ్‌ఎం ప్రేమలత, మహేశ్‌చంద్ర, రమణారెడ్డి, మంజుల, లత, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
శేషాద్రినిరెడ్డికి పదోన్నతి
వేములవాడ: వేములవాడ ఎస్డీపీవోగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రినిరెడ్డికి ప్రభుత్వం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. వేములవాడలోనే పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు ఆమె అడిషనల్ ఎస్పీ హోదాలో వేములవాడ సబ్ డివిజన్ ప్రజలకు సేవలందించనున్నారు.
కష్టపడితేనే విజయం
సిరిసిల్లకల్చరల్: కష్టపడి చదువుకోవడం ద్వారానే విజేతలుగా మారుతారని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ఇంజినీర్ పత్తిపాక మదన్ పేర్కొన్నారు. నిత్య జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సామాన్యులకు దేశభక్తి భావాన్ని విద్యార్థి దశలోనే అందజేస్తున్న వినూత్న కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్, విశ్రాంత ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, కళాశాల అధ్యాపకులు సామల వివేకానంద, శ్రీధర్, వెంకటేశం, కేదారేశ్వర్, కనకయ్య, రాజయ్య, చంద్రమౌళి, ఆంజనేయులు, సరోజ, విజయ, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత, నర్మద పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
సిరిసిల్లఅర్బన్: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా పేర్కొన్నారు. స్వచ్ఛత హీ సేవా–2025 కార్యక్రమంలో భాగంగా చిన్నబోనాల బాలికల గురుకుల విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కమిషనర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు.
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలోకి మిడ్‌మానేరు నుంచి 3,200 క్యూసెక్కుల నీరు వస్తోంది. అదేవిధంగా అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయకసాగర్‌లోకి 3,300 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. అన్నపూర్ణ జలాశయం నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.27 టీఎంసీలకు చేరింది.

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి