
సైబర్ వారియర్లతో నేరాల నియంత్రణ
● ఎస్పీ మహేశ్ బి గీతే
సిరిసిల్లక్రైం: సైబర్ వారియర్లతో జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, తక్షణ చర్యలతో బాధితులకు న్యాయం చేయడంలో కృషి చేసిన సైబర్ సెల్ ఆర్‌ఎస్సై జునైద్, శ్రీకాంత్, డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ రాజశేఖర్, వెంకటరమణలను అభినందించారు. ప్రశంసాపత్రలు, ప్రోత్సహకాలు అందజేసి మాట్లాడారు. సైబర్ నేరాలపై సైబర్ వారియర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, ఎన్సీఆర్పీ పోర్టల్, సమీప ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సెలవులో మున్సిపల్ కమిషనర్
వేములవాడ: మున్సిపల్ కమిషనర్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా మేనేజర్ సంపత్‌రెడ్డిని కలెక్టర్ నియమించారు. వ్యక్తిగత అవసరాలపై కమిషనర్ సెలవుపై వెళ్లినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి.