
ఘనంగా ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
వేములవాడ: ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ 58వ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. వేములవాడలోని తెలంగాణచౌక్ వద్ద 58 కిలోల కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. పార్టీ శ్రేణులు ఆది శ్రీనివాస్‌ను గజమాలతో సత్కరించారు. లింగంపల్లి మాజీ సర్పంచ్ సామ కవితాతిరుపతిరెడ్డి, శాత్రాజుపల్లి మాజీ ఎంపీటీసీ సంగ స్వామియాదవ్, ఈవో రమాదేవి, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు, ఎస్సైలు, తహశీల్దారులు, ఎంపీడీవోలు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం శుభాకాంక్షలు
విప్ ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యమై ముందుకుసాగాలని లెటర్ ద్వారా కోరారు.
గ్రామగ్రామాన వేడుకలు
రుద్రంగిలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామిని ఆది శ్రీని వాస్ దర్శించుకున్నారు. సిరిసిల్లలోని గాంధీచౌక్‌లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణగౌడ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీని వాస్ పాల్గొన్నారు. వేములవాడరూరల్‌లో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వేములవాడఅర్బన్ మండలం నంది కమాన్ వద్ద కేక్ కోసి స్వీట్లు పంచారు. కోనరావుపేటలో షేక్ ఫిరోజ్‌పాషా, ఎల్లారెడ్డిపేటలో వంగ గిరిధర్‌రెడ్డి, తంగళ్లపల్లిలో సత్తు శ్రీని వాస్‌రెడ్డి, గంభీరావుపేటలో హమీద్, ముస్తాబాద్‌లో యెల్ల బాల్‌రెడ్డి, తలారి రాణి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఘనంగా ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు