
ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం
సిరిసిల్ల: ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే మహిళల ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. గురుకులాల్లో బాలికలకు స్పెషల్‌క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలి పారు. అనంతరం పది మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ఐఎంఏ వైద్యులు లీలాశిరీష, పద్మలత, గీతావాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, బండ నర్సయ్యయాదవ్, జగన్‌మోహన్‌రెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, ఫిరోజ్‌పాషా ఉన్నారు.
చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. బోయినపల్లిలో అత్యధికంగా 55.1 మిల్లీమీటర్లు కురి సింది. గంభీరావుపేటలో 32.0, ముస్తాబాద్‌లో 20.8, రుద్రంగిలో 1.5, చందుర్తిలో 3.2, వేములవాడరూరల్‌లో 4.3, వేములవాడలో 12.4, సిరిసిల్లలో 5.9, కోనరావుపేటలో 10.8, వీర్నపల్లిలో 20.1, ఎల్లారెడ్డిపేటలో 3.8, తంగళ్లపల్లిలో 7.9, ఇ ల్లంతకుంటలో 10.9 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.

ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం