
మహిళలపై వేధింపులు నివారించాలి
● జిల్లా న్యాయసేవాధికార సమితి సెక్రటరీ రాఽధికా జైశ్వాల్
సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: మహిళలపై వేధింపుల నివారణలో పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి రాధిక జైశ్వాల్ కోరారు. సిరిసిల్లలోని యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో బుధవారం పనిప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ సూరజ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ కళ్యాణ్ చక్రవర్తి, టి.వెంకటి తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్ర పట్టణమే లక్ష్యం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా మార్చడమే తమ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా పేర్కొన్నారు. ‘స్వచ్ఛతా హీ సేవ’లో భాగంగా బుధవారం పట్టణంలో బల్దియా ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా మాట్లాడుతూ పట్టణ ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రచారం రానున్న రెండు వారాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీ అంబేడ్కర్ జంక్షన్ నుంచి బతుకమ్మఘాట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.
సిరిసిల్లటౌన్: కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీకి ఎందుకు ఆర్భాటమని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు విమర్శించారు. బుధవారం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల ఆర్డీవో ఆఫీసు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అంబేడ్కర్‌చౌరస్తాలో జరిగిన సభలో బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్ శుక్లా, కర్రోళ్ల నర్సయ్య, గడ్డం తిరుపతిరెడ్డి, సింగిరెడ్డి భూపతిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1946 సెప్టెంబర్ 11 నుంచి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ నాయకులు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విద్యార్థులు యువతరం అధ్యయనం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: జిల్లాలో కొ న్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అంగూరి రంజిత్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేసి మాట్లాడారు. పాఠశాలల బస్సులకు సరైన ఫిట్‌నెస్ లేకపోవడం, ఫైర్ ఎగ్జాస్టింగ్ కిట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేకుండా, సీట్ల సంఖ్యకు మించి ఎక్కువ మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలపై వేధింపులు నివారించాలి