
పౌష్టికాహారం అందేలా చూడాలి
జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పోషణ్‌భీ..పడాయిభీపై అవగాహన
వేములవాడ: పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సూచించారు. ‘పోషణ్‌భీ... పడాయీభీ’ కార్యక్రమంపై చందుర్తి, బోయినపల్లి, ధర్మారం, రుద్రంగి, కోనరావుపేట, చెక్కపల్లి, కొదురుపాక, వేములవాడఅర్బన్ సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. లక్ష్మీరాజం మా ట్లాడుతూ అంగన్‌వాడీలలో పూర్వప్రాథమిక విద్య, పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. తక్కువ బరువు పిల్లలను గుర్తించాలని సూచించారు. సీడీపీవో సౌందర్య, సూపర్‌వైజర్లు సరిత, అంజమ్మ, తార, కమల, మమత, లక్ష్మి, నిర్మల, పోషన్ అభియాన్ ఇన్‌చార్జి రాజకుమార్ పాల్గొన్నారు.