వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

Sep 15 2025 7:53 AM | Updated on Sep 15 2025 7:53 AM

వేతన

వేతన వెతలు

సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 ● ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఆహ్వానం ● పారిశుధ్య కార్మికులను రెగ్యులర్‌ చేయాలి. ● ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. కనీసం రూ.26వేలు ఇవ్వాలి. ● హెల్త్‌కార్డులు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. ● కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ● గ్రీన్‌చానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలి. ● అర్హులకు పదోన్నతులు కల్పించి కార్యదర్శులుగా నియమించాలి.

న్యూస్‌రీల్‌

పారిశుధ్య కార్మికులకు పండుగకు పస్తులేనా రెండు నెలలుగా అందని వేతనాలు జిల్లాలో 1,550 మంది కార్మికులు

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

కల్యాణోత్సవానికి హాజరుకండి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీశివ కేశవస్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ను కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లో ఆదివారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 22 నుంచి 24 వరకు ఆంజనేయస్వామి, నవగ్రహాలు, విష్ణుపాదాల ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చివరి రోజు శివకేశవ, రాజరాజేశ్వరస్వామి–పార్వతీదేవీ కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 24న జరిగే కల్యాణానికి రావాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరి, గ్రామ మాజీ సర్పంచ్‌ రామ భీమేశ్వర్‌, నాయకులు వంగల వసంత్‌కుమార్‌, ఉచ్చిడి కిషన్‌రెడ్డి, నారాయణరెడ్డి, చింతల ధర్మయ్య ఉన్నారు.

చిరుజల్లులు

సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రుద్రంగిలో అత్యధికంగా 15.5 మిల్లీమీటర్ల వర్షం పడగా.. బోయినపల్లిలో 3.2, వేములవాడరూరల్‌లో 0.8, సిరిసిల్లలో 0.8, వీర్నపల్లిలో 0.3, ఇల్లంతకుంటలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చందుర్తి, వేములవాడ, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల్లో వర్షం పడలేదు. వేములవాడలో హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడిన జనాలకు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఉపశమనాన్నిచ్చింది. వర్షంతో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.

కరాటేలో గోల్డ్‌ మెడల్‌

ఇల్లంతకుంట: కరీంనగర్‌లో ఆదివారం జరి గిన సౌతిండియా కరాటే చాంపియన్‌షిప్‌–2025లో ఏనుగుల సుశాంత్‌ గోల్డ్‌మెడల్‌ సాధించారు. చెలిమిల రక్షిత, చొప్పరి విఘ్నేశ్వర్‌, ప్రహల్య, సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను తమపై వేసుకుని పనిచేసే పారిశుధ్య కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తక్కువ జీతం సైతం సకాలంలో రాక కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండడంతో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేద్దామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తున్నారు. జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో 1,550 మంది మల్టీపర్పస్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. మల్టీపర్పస్‌ వర్కర్లు రెండు నెలల వేతనాల కోసం పడిగాపులు పడుతున్నారు.

చెల్లింపు విధానం మారినా..

పంచాయతీ కార్మికులకు మూడు నెలల క్రితం వేతనాలు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. గతంలో పంచాయతీ కార్యదర్శులు ఎస్‌టీవోలకు వేతనాల కోసం చెక్కులు పంపేవారు. దీని ద్వారా జీతాల చెల్లింపు ఆలస్యమవుతుందని కార్మికులు ఆందోళన చేశారు. ఒక్కోసారి ప్రభుత్వం ఎస్‌టీవో చెల్లింపులపై ఫ్రీజింగ్‌ పెడుతుండడంతో వేతనాల చెల్లింపులు నిలిచిపోయేవి. జూన్‌లో పారిశుధ్య కార్మికుల వేతనాల కోసం టీఎస్‌ బీపాస్‌ అకౌంట్‌ ప్రారంభించింది. దీని ద్వారా కార్మికుల వేతనాలు పంచాయతీ ఖాతాలో జమవుతున్నాయి. కార్యదర్శి, స్పెషల్‌ ఆఫీసర్‌లు చెక్కు రాసి డబ్బులు తీసుకుని కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌లో కార్మికులు పనిచేసిన దినాలను నమోదు చేసేవారు. దీని ద్వారా బీపాస్‌ ద్వారా జీతాలను ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో విడుదల చేశారు. అయితే జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్‌ సగం వరకు పూర్తయింది. అక్టోబర్‌లో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వస్తుండడంతో త్వరగా వేతనాలు విడుదల చేయాలని కార్మిక నాయకులు కోరుతున్నారు. పండుగలకు బట్టలు, కిరాణ సామగ్రి కోసం ఇబ్బంది పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

కార్మికుల డిమాండ్లు ఇవీ..

నేడు జిల్లా కబడ్డీ సెలెక్షన్స్‌

సిరిసిల్లఅర్బన్‌: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు సబ్‌ జూనియర్‌ బాల, బాలికల జిల్లా జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌, అధ్యక్షుడు ముసుకు మల్లారెడ్డి తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 31.09.2009 తర్వాత జన్మించిన, 55 కిలోల లోపు బరువు ఉండాలని పేర్కొన్నారు. ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ మెమోతో హాజరుకావాలని కోరారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

గంభీరావుపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దోస్త్‌ ద్వారా స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 15, 16 తేదీల్లో విద్యార్థులు తమ అప్లికేషన్లను కళాశాలలో సమర్పించాలన్నారు.

వేతన వెతలు1
1/4

వేతన వెతలు

వేతన వెతలు2
2/4

వేతన వెతలు

వేతన వెతలు3
3/4

వేతన వెతలు

వేతన వెతలు4
4/4

వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement