
బాబోయ్ కుక్కలు
● వీధి దాటాలంటే వణుకుతున్న జనం ● వెంటాడి దాడి చేస్తున్న కుక్కలు ● భయాందోళనలో ప్రజలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇంటికి కాపలా కుక్క అనేది పాత మాట. కుక్కను చూస్తే భయమేస్తుంది అనేది ఇప్పటి సత్యం. గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో పల్లెప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చేతిలో ఏదైనా తినే వస్తువు ఉంటే చాలు మీద పడి లాక్కెళ్తున్నాయి. ఇటీవల జిల్లాలో ఏ పల్లెకు వెళ్లినా కుక్కలు దాడి చేసిన బాధితులే కనిపిస్తున్నారు. కుక్కలను చూస్తే జిల్లా ప్రజలు భయాందోళన చేస్తున్నారు.
గుంపులుగా సంచారం
జిల్లాలో ఏ పల్లెకు పోయినా వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. వీధి దాటి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఊరిలోని బడికి వెళ్లాలంటే కుక్కలు వెంటపడుతాయోనని భయం..భయంగా వెళ్తున్నారు. ఊళ్లలో తిరిగి చిన్న..చిన్న వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కొత్త వారిని చూస్తే కుక్కల మంద మీద పడి కరిచేస్తున్నాయి.
ఊరూరా బాధితులే..