
జీతం ఇచ్చి ఆదుకోవాలి
జీతం రాక ఇబ్బంది అవుతుంది. పండుగలు దగ్గర పడుతున్నయి. సార్లు మా గురించి ఆలోచించాలి. మబ్బుల వచ్చి రోడ్లు ఉడుస్తున్నం. మోర్లు తీస్తున్నం. ప్రతీ నెల జీతం ఇచ్చేటట్లు చేయాలి. పానం బాగలేకపోతే పెద్ద దవాఖాన్లలో ఫ్రీగా చూపెట్టాలి.
– బాలరాజవ్వ, కార్మికురాలు, నామాపూర్
కార్మికులకు అండగా నిలవాలి
ఎంతో కష్టపడి పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలి. అనారోగ్యానికి గురవుతున్న పనిచేస్తున్నాం. చెత్తను తీయడం, మోర్లు సాపు చేయడం ఇప్పటితరం చేయలేదు. కుటుంబాలను పోషించుకునేందుకే పారిశుధ్య పనులు చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచించి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచి ఆదుకోవాలి.
– శ్రీనివాస్, సీఐటీయూ మండలాధ్యక్షుడు
కొత్త విధానంలోనైనా జీతాలు ఇవ్వాలి
గతంలో మాకు ఎస్‌టీవోతో జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానంతో వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీని ద్వారానైనా ప్రతీ నెల జీతాలు ఇస్తే బాగుండు. కార్మికుల జీవితాలు చిన్నవి. జీతాలు వస్తేనే మా కుటుంబాలను పోషించుకుంటాం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
– బాబు, పంపు ఆపరేటర్, ముస్తాబాద్

జీతం ఇచ్చి ఆదుకోవాలి

జీతం ఇచ్చి ఆదుకోవాలి