
ఉపాధికి ఇబ్బంది అవుతోంది
చేపపిల్లలు విడుదల చేయకపోవడంతో ఉపాధికి ఇబ్బంది అవుతోంది. మిడ్‌మానేరులో చేపపిల్లలు వదిలితే కొదురుపాక, వెంకట్రావుపల్లి, కరీంనగర్ రోడ్డు పరిసరాల్లో చాలా మంది మత్స్యకారులు చేపల దుకాణాలతో జీవనోపాధి పొందుతున్నారు.
– మైలారం శ్రీనివాస్, మత్స్యకారుడు, కొదురుపాక
చేపపిల్లలు ఎదగవు
గతేడాది ఆలస్యం కావడంతో చేపపిల్లల సైజ్ పెరుగలేదు. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే పంపిణీ చేసేవారు. దీంతో చేపల సైజ్ బాగా వచ్చి లాభం వచ్చేది. ఆలస్యంగా పంపిణీ చేస్తే సరైన ఎదుగుదల ఉండదు.
– బొజ్జ శ్రీనివాస్, బోయినపల్లి
టెండర్ల ప్రక్రియ పూర్తి
జిల్లాలో ఈ ఏడాది నాలుగు ప్రాజెక్టులతోపాటు 452 చెరువుల్లో కలిపి 1.48 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లు ఈనెల 15న ఓపెన్ చేస్తారు. అనంతరం మిగతా ప్రక్రియలు పూర్తి చేశాక చేపపిల్లల పంపిణీ చేస్తాం.
– సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి

ఉపాధికి ఇబ్బంది అవుతోంది

ఉపాధికి ఇబ్బంది అవుతోంది