
ప్రార్థనా మందిరాలు.. సంస్కరణ కేంద్రాలు
ప్రవక్త ఆలోచనలు ఆదర్శనీయం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్లకల్చరల్: ప్రార్థనా మందిరాలు మనుషులను సంస్కారవంతులుగా చేసే కేంద్రాలు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో శుక్రవారం నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతపెద్దలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఎస్పీ మహేశ్ బి గీతే, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, చొప్పదండి ప్రకాశ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్, ఎండీ సత్తార్ పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ర్యాలీ
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉదయం జామే మజీద్ నుంచి కొత్తబస్టాండ్ వరకు బైక్‌ర్యాలీ, మధ్యాహ్నం జామే మజీద్ నుంచి పెద్దబజార్, పాతబస్టాండ్, గాంధీచౌక్ మీదుగా హజ్రత్ సయ్యద్ షావలీ ర్యాలీ కొనసాగింది. మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, ఎండీ సలీం, ఎండీ సత్తార్, షేక్ యూసుఫ్, రఫీక్, సయ్యద్ సమద్, సాధిక్, జాంగీర్, రియాజ్, ఫ యాజ్, అంజాద్, షాదాబ్, చాంద్, వాజిద్, సలీం, సోను, అఫ్రోజ్, సమీర్ పాల్గొన్నారు.
ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం
వేములవాడఅర్బన్: ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లిలోని పలు అభివృద్ధి పనులకు శుక్రవారం భూమిపూజ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతూ ముందుకు పోతున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా గత పాలకుల హయాంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. బొజ్జపల్లిలో బతుకమ్మ తెప్ప నిర్మాణానికి భూమిపూజ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాగిరి నాగరాజు, చిలివేరి శ్రీనివాస్, బాబు, కాశ శ్రీనివాస్, నీలం గురువయ్య, భారతి, సాదుల్లా, ప్రశాంత్‌రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.