
మసాలా లేకపాయె!
నారు ముదిరె..
ఇతను చందుర్తి మండలం ఎన్గల్‌కు చెందిన కుసుంబ మధు. 12 ఎకరాలలో పత్తి, 5 ఎకరాలలో వరి వేశాడు. మొదటి దఫాగా కాంప్లెక్స్ ఎరువులు వేశాడు. రెండో విడతగా పత్తికి యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు వేద్దామనుకున్నాడు. 20 రోజులు తిరిగి క్యూలైన్‌లో ఉంటే 8 బస్తాల యూరియా దొరికింది. అవి సరిపోవని పంటకు వేయకపోవడంతో ఆలస్యమైంది.
ఇతను కోనరావుపేట మండలం కొలనూర్ రైతు వీరవేణి అజయ్. 26 రోజుల కిందట మూడెకరాలలో వరి నాట్లు వేశాడు. గతంలో ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటి వద్ద వేసేవాడు. కొలనూర్ సింగిల్‌విండోకు యూరియా రావడం లేదు. దీంతో సిరిసిల్లకు వచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది.
ఇతను బైకని మల్లేశం. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాల. మల్లేశం తన మూడెకరాలలో వరి వేశాడు. 25 రోజులు కిందటే వరినాట్లు పూర్తయ్యాయి. యూరియా చల్లుదామంటే దొరకడం లేదు. దీంతో శుక్రవారం ఉదయం 7.15 గంటలకు సిరిసిల్ల ప్రైవేటు ఎరువుల దుకాణం ఎదుట క్యూలో నిల్చున్నాడు. మూడు బస్తాల యూరియా అవసరం ఉండగా.. ఒక్క బస్తా దొరికింది.

మసాలా లేకపాయె!

మసాలా లేకపాయె!