
పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్ తప్పనిసరి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కోనరావుపేట(వేములవాడ): యూరియా కోసం వచ్చే రైతులు వెంట తప్పనిసరిగా పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డ్ తీసుకురావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్, సుద్దాల గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతువేదికల్లో శుక్రవారం యూరియా పంపిణీని పరిశీలించారు. అవసరం ఉన్న మేరకే యూరియాను తీసుకెళ్లాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఏవో సందీప్, మండల వ్యవసాయాధికారులు ఉన్నారు.
రోగులకు మెరుగైన సేవలందించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లిలోని పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు రిజిస్టర్, అన్ని వార్డులు, మందుల గదిని పరిశీలించారు. నిత్యం ఆస్పత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారని ఆరా తీశారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ అధికారి ఎండీ అఫీజ, వైద్యులు అంజలి, అనిత, ఏఎన్‌ఎంలు జ్యోతి, ప్రమీల, అనిత, శ్రావణి పాల్గొన్నారు.