
విభిన్న ప్రయత్నం.. దక్కిన గౌరవం
వేములవాడఅర్బన్: పనితీరులో వినూత్నం కనిపించిన ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించింది. విధులకు హాజరుకావడమే కాదు విద్యార్థుల కోసం ఇంకేమి చేయవచ్చని ఆలోచించి విభిన్నంగా చేస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. ఇలాంటి కోవలోకి అగ్రహారం పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజగోపాల్ వస్తారు.
ఆలుమ్ని టాక్స్‌తో గుర్తింపు
వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి.రాజగోపాల్ తన హయాంలో అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజీలో బాలికల వసతిగృహం ఏర్పాటుకు ఏఐసీటీఈ నుంచి నిధులు మంజూరుకు కృషి చేశారు. 2017–18లో సృజన్ టెక్ ఫెస్టు నిర్వహించారు. 2022లో ఆలుమ్నిటాక్స్ ప్రారంభించి పూర్వ విద్యార్థుల అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో పంచుకునే వేదికను ఏర్పాటు చేశారు. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ కార్యక్రమాలకు గరిష్ట మార్కులతో ఎన్‌బీఏ గుర్తింపు పొందారు.