ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి

Sep 5 2025 5:06 AM | Updated on Sep 5 2025 5:06 AM

ఆధ్యా

ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి

● ఎస్పీ మహేశ్‌ బి గీతే ● రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మాండ్లు శ్రమిస్తేనే విజయం సాధిస్తారు ● డీఐఈవో శ్రీనివాస్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాల్య వివాహాలు నేరం

● ఎస్పీ మహేశ్‌ బి గీతే

సిరిసిల్ల: ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయని ఎస్పీ మహేశ్‌ బి గీతే పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పాతబస్టాండు ఆర్యవైశ్య భవన్‌లో గురువారం మహా అన్నదా నాన్ని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు వాసవీ మాత పేరిట అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ మహేశ్‌ బి గీతే, సిరిసిల్ల టౌన్‌ సీఐ కృష్ణను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కటుకం సత్తయ్య, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌, జిల్లా సంఘం మాజీ అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్‌, ప్రతినిధులు గూడెల్లి మధు, రాజూరి వాసుదేవరాయలు, చేపూరి జమున, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

నేడు రేషన్‌షాపులు బంద్‌

సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం రేషన్‌షాపులను బంద్‌ చేస్తున్నామని జిల్లా రేషన్‌ డీలర్ల సంక్షే మ సంఘం అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మాండ్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.5వేలు, కమీషన్‌ పెంపును అమలు చేయాలని కోరుతూ ఒక్క రోజు బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీని నెరవేర్చలేదన్నారు. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు, షాపుల అద్దెలు, గుమస్తా భత్యం, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్‌ చార్జీలు, దిగుమతి హమాలీ చెల్లింపుల ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నామని వివరించారు.

సిరిసిల్లకల్చరల్‌: అలుపెరగని శ్రమతోనే జీవితంలో విజయ శిఖరాలను చేరుకుంటారని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శివనగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను గురువారం తనిఖీ చేశారు. కళాశాల రికార్డులు, విద్యార్థుల హాజరును సమీక్షించారు. డీఐఈవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నవీన బోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని అధ్యాపకులకు సూచించారు. జేఈఈ పరీక్షల కోసం ఫిజిక్స్‌వాలా ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కనకశ్రీ విజయరఘునందన్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట/తంగళ్లపల్లి: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో రజిత పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పీహెచ్‌సీలను గురువారం తనిఖీ చేశారు. గ్రామంలోని ఎస్సీకాలనీలో పర్యటించారు. డ్రై డే పాటించాలని, ఇళ్లల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంట్లోకి దోమలు రాకుండా మెష్‌డోర్స్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్యులు సంపత్‌కుమార్‌, రామకృష్ణ, ప్రేమ్‌కుమార్‌, హెచ్‌ఈవో వెంకటరమణ, కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: బాల్య వివాహాలు శిక్షార్హమని జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కవిత పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీపీఎస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సంయుక్తంగా సిరిసిల్ల కుసుమ రామయ్య బాయ్స్‌ హైస్కూల్‌లో గురువారం పోక్సో, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, పోక్సో నేరాలు జరిగితే వెంటనే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కేసు వర్కర్‌ సాయిప్రసన్న, సాయిరాం పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక సేవలు   ఆత్మసంతృప్తినిస్తాయి1
1/3

ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి

ఆధ్యాత్మిక సేవలు   ఆత్మసంతృప్తినిస్తాయి2
2/3

ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి

ఆధ్యాత్మిక సేవలు   ఆత్మసంతృప్తినిస్తాయి3
3/3

ఆధ్యాత్మిక సేవలు ఆత్మసంతృప్తినిస్తాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement