
కార్మికులకు భారం తగ్గించాలి
సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో పడకల(బెడ్స్)కు అనుగుణంగా శానిటేషన్ కార్మికులతోపాటు ఇతర విభాగాల్లో సిబ్బందిని నియమించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ఈమేరకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆస్పత్రి ఎదుట గురువారం ధర్నా చేపట్టి మాట్లాడారు. హామీ ప్రకారం నాలుగు రోజుల్లోపు సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలని, లేకుంటే సోమవారం నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం 100 పడకులకు 45 మంది చొప్పున 330 పడకలకు దాదాపు 150 మంది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది పనిచేయాలన్నారు. కానీ 77 మందితో నెట్టుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమణి, భాగ్య, లత, సుజాత, జయ, తిరుపతి, రవి, లావణ్య, లలిత, మమత, స్నేహ, రంగయ్య, రమ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.