
యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న వంతెన వద్ద యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి శివారులోని వంతెన వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును కలెక్టర్ గురువారం పరిశీలించారు. పది రోజుల్లోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, పీఆర్ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు చేపట్టాలి
ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలన్న కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గ్రామంలోని వీధుల్లో పారిశుధ్య నిర్వహణ పనులు పూర్తి చేశారు. చెత్తా చెదారం తొలగించారు. అంగన్వాడీ విద్యార్థుల సౌకర్యార్థం తాత్కాలికంగా గ్రామపంచాయతీ భవనంలోని ఒక గదిని కలెక్టర్ ఆదేశాలతో కేటాయించారు. దీంతో చిన్నారులకు సౌకర్యాలు ఉన్న గది అందుబాటులోకి వచ్చింది.
అసంపూర్తి పనులు పూర్తి చేయాలి
నారాయణపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నారాయణపూర్, రాగట్లపల్లిల్లోని ప్రైమరీ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ సిలిండర్‌పై తయారుచేయాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీ, నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రాగట్లపల్లిలోని స్కూల్‌కు ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు.
కలెక్టరేట్‌లో వినాయకుడి వద్ద అన్నదానం
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లోని వినాయకుడి వద్ద గురువారం అన్నదానం చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నదానాన్ని ప్రారంభించారు. అధికారులు, సిబ్బందికి స్వయంగా వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఏవో అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.