
సాహిత్య ధృవతార సినారె
సిరిసిల్లటౌన్: సాహిత్య ప్రపంచంలో సాటిలేని ధృవతారగా డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రస్తానం సాగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారాకరామారావు కొనియాడారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం సినారె జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు సినారె సాహితీ సేవలను స్మరించుకుంటూ సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్ చేశారు. కవితలు, పద్యకావ్యాలు, గేయకావ్యాలు, గజల్స్, వ్యాసాలు, సినిమా పాటలు... రూపం ఏదైనా సినారె కలానికి తిరుగులేదన్నారు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీగేయ రచయిత పాత్ర ఏదైనా సినారె ప్రతిభకు సాటిలేదన్నారు. ప్రపంచ సాహితీ లోకానికి తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యంగా సినారెను కొనియాడారు. ఈ సందర్భంగా సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలి అర్పించారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, నాయకులు గూడూరి ప్రవీణ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, కుంభాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్