న్యాయం చేయండి
మాది సిరిసిల్లలోని రాజీవ్‌నగర్. ఆరు నెలల కింద ఇద్దరు వచ్చి నా దగ్గర రూ.20వేలు తీసుకున్నారు. ఒకరు ప్రకాశ్‌రావు వకీలు వద్ద పనిచేస్తానని, మరొకరు పోలీస్ అని చెప్పారు. నా బంగారం తాకట్టుపెట్టి ఆ డబ్బులు ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి.
– కోన లక్ష్మి, సిరిసిల్ల
పింఛన్ ఇప్పించాలి
మాది గంభీరావుపేట మండలం. నాకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. కొద్దిరోజుల క్రితం నా ఖాతాలో రూ. 50వేలు జమయ్యాయి. అది నాకు తెల్వదు. బ్యాంక్ వాళ్లు నా అకౌంటు ఫ్రీజ్ చేశారు. బ్యాంకు అఽధికారులను అడిగితే పోలీసోళ్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నాకు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలంటే తీసుకోవడానికి వీల్లేకుండా ఉంది.
– మేర్గు లక్ష్మి, గంభీరావుపేట
బ్యాటరీ వీల్‌చైర్ ఇప్పించండి
నాకు 14 సంవత్సరాలు. మాది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్. డీఎంవో వ్యాధితో బాధపడుతున్నాను. నేను నడవలేను. నాకు బ్యాటరీ వీల్‌చైర్ ఇప్పించాలి. ఇది వరకు కూడా దరఖాస్తు ఇచ్చాం. కలెక్టర్ సార్ దయచూపాలి. – మహమూద్, ఎల్లారెడ్డిపేట
స్కూటీ ఇప్పించాలి
మాది సిరిసిల్ల శివారులోని సర్దాపూర్. పుట్టుకతో దివ్యాంగురాలిని. పూర్తిగా నడవలేని స్థితి. గతంలో కూడా పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేశాం. మూడు చక్రాల స్కూటీని అందించాలి. – మట్టె దివ్య, సర్దాపూర్
మందులు కొరత తీర్చాలి
జిల్లా ఆస్పత్రిలో మందుల కొరతను తీర్చాలి. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలు బయట డబ్బులు పెట్టి మందులు కొంటున్నారు. కొంతమంది సిబ్బంది రోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – అన్నల్‌దాస్ గణేష్, సిరిసిల్ల
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్క
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్క
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్క
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్క