గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు

Mar 25 2025 12:08 AM | Updated on Mar 25 2025 12:08 AM

గ్రీవ

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు

సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ మహేశ్‌ బీ.గీతే తెలిపారు. బాధితులతో మాట్లాడిన అనంతరం అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు.

బీడీ కార్మికుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

కోనరావుపేట(వేములవాడ): సిరిసిల్లలో బీడీ కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవ్వాజి విమల కోరారు. మల్కపేటలో సోమవారం మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా మంది కార్మికులకు అందడం లేదన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కొమ్ము సుభద్ర, ఎర్రోళ్ల ఎల్లవ్వ, కంబంపెల్లి వరలక్ష్మి, భవాని, దేవేంద్ర, లక్ష్మి, భూమయ్య, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

అంజన్న ఆలయ ఇన్‌చార్జి ఈవోగా శ్రీనివాస్‌

వేములవాడఅర్బన్‌: అగ్రహారం శ్రీహనుమాన్‌ ఆల య అడిషనల్‌ ఇన్‌చార్జి ఈవోగా నాగారపు శ్రీనివా స్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఈవో మారుతీ బదిలీపై వెళ్లారు. ఈనెల 28న హుండీ లెక్కించనున్నట్లు తెలిపారు.

ఐడీఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ రాజు

సిరిసిల్ల: ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ పి.రాజు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ ఎస్‌.సతీశ్‌కుమార్‌, కోశాధికారిగా డాక్టర్‌ డి.శ్యాంసుందర్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఐడీఏ జిల్లా తొలికార్యవర్గ ప్రమాణస్వీకారం ఐడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ డీఎన్‌ స్వామి, కార్యదర్శి డాక్టర్‌ డి.చలపతిరావు, కార్యదర్శి డాక్టర్‌ డి.నవీన్‌ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డీఎన్‌ స్వామి మాట్లాడుతూ వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించడానికి నోటి ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించాలన్నారు. జిల్లా దంతవైద్యులు శివరామకృష్ణ, పూర్ణచందర్‌, గోపీకృష్ణ, కె.రాజేందర్‌, సంతోష్‌, ఎం.రాజేందర్‌, నరేశ్‌, ఓం బ్రహ్మం, వెంకటేశ్‌, వంశీ, ఎ.సంతోష్‌, విజయకుమార్‌, రమ్య, స్నేహ, ఆకాంక్ష, స్రవంతి, ప్రియాంక, గీత, త్రిసంధ్య, లహరి, చందన, నిఖిత, జయశ్రీ, శిల్ప పాల్గొన్నారు.

సెమిస్టర్‌ పరీక్షలు బహిష్కరిస్తాం

వేములవాడఅర్బన్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో సెమిస్టర్‌ పరీక్షలు బహిష్కరిస్తామని శాతవాహన యూ నివర్సిటీ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఎస్‌యూ రిజి స్ట్రార్‌ రవికుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సుప్మా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడు తూ రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్‌ తేదీలను ప్రకటించవద్దని కోరామన్నారు. పరీక్షల తేదీలను ప్రకటించి నిర్వహణకు ముందుకొస్తే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేశ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అయాచితుల జితేందర్‌రావు, విష్ణు ఉన్నారు.

నేడు కేంద్ర పథకాలపై

అవగాహన

సిరిసిల్లకల్చరల్‌: కేంద్రం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ, పీఎం విశ్వకర్మ, పీఎం ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం, పీఎం ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజేస్‌ స్కీమ్‌, పీఎం ఇంటర్న్‌షిప్‌ తదితర పథకాలపై మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పరి శ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ హనుమంతు తెలి పారు. పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలిసి నిర్వహించే సదస్సుకు నిరుద్యోగ యువత హాజరుకావాలని కోరారు.

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు 
1
1/3

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు 
2
2/3

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు 
3
3/3

గ్రీవెన్స్‌ డేకు 13 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement