
అక్రమ పట్టాదారుడు అరెస్ట్
● తహసీల్దార్‌తోపాటు ముగ్గురిపై కేసు
చందుర్తి(వేములవాడ): పట్టాదారులకు తెలియకుండా భూమిని అక్రమ పట్టా చేసుకున్న వ్యక్తితోపాటు తహసీల్దార్, వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఎస్సై అంజయ్య తెలిపిన వివరాలు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి వెంకటరాములుకు చెందిన 73 సర్వేనంబర్‌లో 2.08 ఎకరాల భూమిని, అదే సర్వేనంబర్‌లోని దొంగరి శంకర్‌కు చెందిన 2.07 ఎకరాలను అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి రాములు ఉరప్ చిన్నరాములు 4.15 ఎకరాల పట్టా చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో అక్రమ పట్టా చేసుకున్న ఈర్లపల్లి రాములుతోపాటు పట్టాచేసిన అప్పటి తహసీల్దార్ రాజగోపాల్‌రావు, వీఆర్వో రాజేశంలపై కేసు నమోదు చేశారు. అక్రమ పట్టా చేసుకున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకోగా, తహసీల్దార్, వీఆర్వోలు పరారీలో ఉన్నారు. త్వరలోనే పట్టుకోనున్నట్లు ఎస్సై తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
● రూ.50వేలు ఆర్థికసాయం అందించిన కలెక్టర్
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలో అంగోతు రాములు ఇల్లు బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇంట్లో నిల్వచేసిన ధా న్యం, వంట సామగ్రి, బట్టలు బూడిదయ్యాయి. రాములు కుమారుడు గణేశ్ చదువుకుంటున్న సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పరామర్శించారు. ఈ విషయం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో వెంటనే ప్రభుత్వం తరఫున రూ.50వేల చెక్కును అందజేశారు.
రాజన్న సేవలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి
వేములవాడ: రాజన్నను ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ టౌన్ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

అక్రమ పట్టాదారుడు అరెస్ట్