
ఒకే దేశం.. ఒకే ఎన్నికపై దృష్టి
తంగళ్లపల్లి: ఒకే ఓటు..ఒకే దేశం.. ఒకే ఎన్నిక బీజేపీ దృష్టికోణమని ఆ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ఇన్‌చార్జి మల్లారపు సంతోష్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మల్లారపు సంతోష్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంతో ఖర్చులు తగ్గించవచ్చన్నారు. జమిలీ ఎన్నికలను బీజేపీ 1984 మేనిఫెస్టోలో ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు. కన్వీనర్ రెడ్డిమల్ల సుఖేందర్, కోకన్వీనర్ మోర శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కార్యదర్శి ఆశీర్వాద్, ఉపాధ్యక్షుడు గోనెపల్లి శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు కోసిని వినయ్, ఓబీసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, నాయకులు బొలగం భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.