ఇల్లంతకుంట(మానకొండూర్): తమకు డబుల్ బెడ్‌రూము ఇళ్లను అధికారులు ఇచ్చేలా లేరనుకుని మండల కేంద్రానికి చెందిన 10 మంది లబ్ధిదారులు మంగళవారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి ప్రవేశించారు. ఇళ్లకు అధికారులు వేసిన తాళాలు పగులకొట్టి వెళ్లారు. వారు మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఇళ్లు కేటాయించిన అధికారులు ఇప్పటి వరకు అప్పగించలేదన్నారు. సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అద్దె ఇళ్ల ఇబ్బందులు తప్పించుకునేందుకు తాము తమకే వచ్చి, ఖాళీగా ఉంటున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి వెళ్లినట్లు చెప్పారు.
‘డబుల్’ ఇళ్ల పరిధిలో 163 సెక్షన్ అమలు
ఇల్లంతకుంటలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి ఎవరూ వెళ్లకూడదని, ఆ ప్రాంతంలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని తహసీల్దార్ ఫారుఖ్ మంగళవారం రాత్రి ప్రకటనలో తెలిపారు. ఆ ఇళ్ల చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండకూడదని పేర్కొన్నారు.