● ఎస్పీ మహేశ్ బి.గీతే ● వేములవాడలో పర్యటన
వేములవాడ: రాజన్న కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, ఈఈ రాజేశ్, టౌన్ సీఐ వీరప్రసాద్‌లతో కలిసి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు, కల్యాణ మండపం, గోశాల, ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100 డయల్ చేయాలన్నారు. రాజన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈవో స్వామి వారి ప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు.