
సభ్యత్వ నమోదులో ముందంజ
● జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలి ● మహిళా కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జి సుగుణ
సిరిసిల్లటౌన్: సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని, అదే స్ఫూర్తితో జిల్లాను రాష్ట్రంలోనే ముందువరుసలో నిలపాలని మహిళా కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జి సుగుణ పేర్కొన్నారు. డీసీసీ ఆఫీస్‌లో శనివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గత సెప్టెంబర్ 15 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, రాష్ట్ర నాయకులు గోవిందమ్మ, సుమలత, ఏఎంసీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, కాంగ్రెస్ యూనియన్ నాయకురాలు మడుపు శ్రీదేవి, బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరాబేగం, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా జనరల్ సెక్రెటరీ కోడం అరుణ, సుధా రోజా, లత, హారికరెడ్డి, వనిత, సానియా, లత పాల్గొన్నారు.
21న హుండీలు లెక్కింపు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని శివసాయిబాబా ఆలయంలో ఈనెల 21న హుండీలు లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు హుండీల లెక్కింపు ఉంటుందని ప్రజలు పాల్గొనాలని కోరారు.
నేడు నీటి సరఫరాలో అంతరాయం
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం తెట్టకుంట శివారు 120 ఎంఎల్‌డీ నీటిశుద్ధి కేంద్రంలోని తాగునీటి పంప్‌హౌస్‌లో మరమ్మతులు చేపడుతున్నట్లు మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శేఖర్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా ఆదివారం వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి మున్సిపాలిటీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. తిరిగి సోమవారం యథావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు.