
కమనీయం.. నృసింహుని కల్యాణం
రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని శ్రీ ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణాన్ని శుక్రవారం గంగపుత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం గంగపుత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు దేశవేని ధర్మేందర్, సభ్యులు భూమయ్య, శ్రీనివాస్, భూమేశ్, గంగాధర్, విక్రమ్, వినోద్, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): ముస్కానిపేటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా ఆలయంలో వివిధ హోమాలు, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయం వద్ద అన్నదాన చేశారు. ఆలయ చైర్మన్ బద్దం హనుమంతరెడ్డి, కార్యవర్గం, గ్రామ ప్రముఖులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

కమనీయం.. నృసింహుని కల్యాణం