
కాల్వ పనులు పూర్తి చేయండి
● కేంద్రమంత్రికి వినతిపత్రం
ఇల్లంతకుంట(మానకొండూర్): రంగనాయకసాగర్ నుంచి ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఎల్‌ఎం–6 కాల్వ పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని దీక్ష చేస్తున్న రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు విన్నవించారు. కరీంనగర్‌లో శుక్రవా రం కలిసి ఈమేరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. గత పన్నెండు రోజులుగా దీక్ష చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రెండు కిలోమీటర్ల కాల్వ పూర్తిచేస్తే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని 9,500 ఎకరా లకు సాగునీరు అందుతుందన్నారు. భూమల్ల అనిల్‌కుమార్, వెన్నమనేని శ్రీధర్‌రావు, అమ్ముల అశోక్, పయ్యావుల బాలయ్య, గాదె మధుసూదన్, మల్లేశం ఉన్నారు.
నేడు గౌరపూర్ణిమ వేడుకలు
సిరిసిల్లకల్చరల్: అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని నూతన ఆలయ ప్రాంగణంలో శ్రీగౌర పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ స్థానిక ఇన్‌చార్జి ప్రాణనాథ అచ్యుతానంద్ దాస్ తెలిపారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా నిర్వహించే వేడుకలో హైదరాబాద్ నుంచి సుమారు 150 మందితోపాటు స్థానిక పరిసర గ్రామాల నుంచి 2వేలకు పైగా భక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడికి జలాభిషేకం, ఫల పంచామృతాభిషేకాలు, హరినామ సంకీర్తనలు నిర్వహిస్తామని వివరించారు. ఇస్కాన్ ప్రతి నిధులు మంగళారపు ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడు ‘సఖీ’ కేంద్రం పోస్టులకు ఇంటర్వ్యూ
సిరిసిల్ల: సఖీ కేంద్రంలోని పోస్టులకు శనివారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం శుక్రవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
సిరిసిల్లకల్చరల్: నెహ్రూ యువకేంద్రం, బీసీ యూత్ అసోసియేషన్ సంయుక్తంగా ఆది, సోమవారాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌వైకే మాజీ వలంటీర్ గంగిపెల్లి స్వామికుమార్ తెలిపారు. అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే స్పోర్ట్స్‌మీట్‌లో వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, షాట్‌పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల జట్లు 81214 58893, 95153 99531లలో సంప్రదించాలని సూచించారు.
నేత్రపర్వంగా రథోత్సవం
చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయంలో ఉదయం 10 గంటల వరకు నిత్యారాధన, 10.30 గంటలకు రథహోమం, పూర్ణాహుతి, రథ బలిహరణ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం జరిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండ లక్ష్మ ణ్‌గౌడ్, గౌరవ అధ్యక్షుడు ఏనుగు లచ్చిరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కటకం చంద్రయ్య, నాయకులు మల్యాల గంగనర్సయ్య, లింగంపల్లి బాబు, అంబాల శ్రీకాంత్, గంప పవన్, కటకం రవి, అటుకుల మధు, గ్రామస్తులు పాల్గొన్నారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.

కాల్వ పనులు పూర్తి చేయండి

కాల్వ పనులు పూర్తి చేయండి