● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
చందుర్తి(వేములవాడ): పోలీస్‌స్టేషన్‌లో వివిధ స మస్యలపై వచ్చిన ఫిర్యాదు చేసే వారిపై మర్యాదగా వ్యవహరిస్తూ పరిష్కరించాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి కోరారు. చందుర్తి ఠాణాను గురువారం తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. కేసుల రికార్డులు, జీడీబుక్‌లను పరిశీలించా రు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని, స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. కానిస్టేబుళ్లు తమ విధులను సమయానికి అనుగుణంగా నిర్వర్తించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య పాల్గొన్నారు.