జిల్లా రుణ ప్రణాళిక రూ.3,948.01 కోట్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లా రుణ ప్రణాళిక రూ.3,948.01 కోట్లు

Mar 12 2025 7:26 AM | Updated on Mar 12 2025 7:23 AM

● వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల: జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మంగళవారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వార్షిక రు ణ ప్రణాళికను నాబార్డు అంచనాల మేరకు రూ. 3,948.01 కోట్లుగా నిర్ధారించారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) జిల్లాలోని బ్యాంకులకు ఈ ఏడాది రూ.3,203 కోట్ల రు ణ సాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. గతేడాది లక్ష్యంతో పోల్చితే ఇది 23 శాతం అ ధికమని వార్షిక నివేదికలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి పొటెన్షి యల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌(పీఎల్‌పీ)ను విడుదల చే శారు. ఇందులో అగ్రభాగం వ్యవసాయ రంగానికి రూ.3,189.07 కోట్లు కేటాయించగా, సూక్ష్మ, చి న్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 612.30కోట్లు, ఎగుమతుల రంగానికి రూ. 3.20కోట్లు, విద్యా రుణాలకు రూ.28.0కోట్లు, గృహనిర్మాణాలకు రూ.40.04 కోట్లు, సామాజిక మౌ లిక సదుపాయాలకు రూ.10.80 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.31.10 కోట్లు ఇతర రంగాలకు కలిపి రూ.33.50 కోట్ల రుణాలను అందించి జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని ఆ కాంక్షించారు. కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ ఎం.దిలీప్‌ చంద్ర, డీఆర్‌డీవో బి.శేషాద్రి, లీడ్‌ జిల్లా మేనేజర్‌ టీఎన్‌ మల్లికార్జునరావు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి

సిరిసిల్ల: ఉత్తమ బోధనతో పాటు విద్యార్థుల ఆ రోగ్యం ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకులాన్ని మంగళవారం సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే వివరాలను తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్‌, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు ఎలా రాస్తున్నారు అని అడిగారు. విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో 338 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశామని డీఎంహెచ్‌వో రజిత వివరించారు. కంటి ఆపరేషన్‌ అవసరమైన వారిని హైదరాబాద్‌ సరోజినీదేవి ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.సంపత్‌కుమార్‌, ఆర్‌బీఎస్‌కే. ప్రోగ్రాం ఆఫీసర్‌ డా.నయీంజహాన్‌ షేక్‌, మెడికల్‌ ఆఫీసర్‌ కృష్ణవేణి తదితరులు ఉన్నారు.

జిల్లా రుణ ప్రణాళిక రూ.3,948.01 కోట్లు1
1/1

జిల్లా రుణ ప్రణాళిక రూ.3,948.01 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement